te_obs/content/39.md

9.0 KiB

39. యేసును తీర్పు తీర్చారు

OBS Image

మధ్య రాత్రి సమయంలో సైనికులు యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళారు, ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించాలని కోరాడు. పేతురు ఆయనను అనుసరిస్తూ ఉన్నాడు. సైనికులు యేసును ప్రధాన యాజకుని మందిరంలోనికి తీసుకొని వెళ్తుండగా పేతురు వెలుపట కూర్చుండి చలి కాచుకొంటున్నాడు.

OBS Image

ప్రధాన యాజకుని గృహంలో యూదా నాయకులు యేసును తీర్పు తీరుస్తున్నారు. ఆయనను గురించి అనేక తప్పుడు సాక్ష్యాలను తీసుకొని వచ్చారు. అయితే వారి మాటలు ఒకదానితో ఒకటి పొంతనలేకుండా ఉన్నాయి. అందుచేత యూదా నాయకులు ఆయనను దోషి అని దేనిలోనూ రుజువు చెయ్యలేకపోయారు. యేసు వారితో ఒక్క మాట కూడా పలుకలేదు.

OBS Image

చివరకు ప్రధాన యాజకుడు నేరుగా యేసుతో ఇలా అడిగాడు, “మాతో చెప్పు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన మెస్సీయవా?”

OBS Image

అందుకు యేసు, “నేను మెస్సీయను, నేను తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవడం, పరలోకం నుండి రావడం మీరు చూస్తారు.” అది విని ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొన్నాడు, ఎందుకంటే యేసు పలికినదాని విషయంలో చాలా కోపగించుకొన్నాడు. అతడు ఇతర నాయకులతో బిగ్గరగా చెప్పాడు, “ఇతడు చేసిన వాటి విషయంలో మనకిక ఇతర సాక్ష్యాలతో పని లేదు, అయన దేవుని కుమారుడని చెప్పిన మాట మీరే విన్నారు. ఇతని గురించి మీ నిర్ణయం ఏమిటి?”

OBS Image

యూదా నాయకులందరూ ప్రధాన యాజకునితో, “ఇతను చావవలసి ఉంది!” అని జవాబిచ్చారు. అప్పుడు వారు యేసు కళ్ళకు గంతలు కట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను కొట్టారు, ఆయనను హేళన చేసారు.

OBS Image

పేతురైతే ఇంటిముందు ఆవరణలో కూర్చుండి ఉన్నాడు. చిన్న బాలిక అతనిని చూసింది, ఆమె పేతురుతో ఇలా అంది, “నీవు యేసుతో ఉన్నవాడవు కదూ!” పేతురు దానిని త్రోసిపుచ్చాడు. తరువాత మరొక అమ్మాయి అదే మాట పేతురును అడిగింది. పేతురు మరల ఆ మాటను త్రోసిపుచ్చాడు. చివరిగా కొందరు వ్యక్తులు ఇలా అన్నారు, “నీవు యేసుతో ఉన్నవాడవని మాకు తెలుసు, ఎందుకంటే మీరిద్దరూ గలిలయవారు.”

OBS Image

అప్పుడు పేతురు, “ఈ వ్యక్తిని నేను యెరిగియుంటే దేవుడు నన్ను శపించును గాక!” పేతురు ఈ విధంగా ఒట్టుపెట్టు కొన్న వెంటనే కోడి కూసింది. యేసు తిరిగి పేతురు వైపు చూచాడు.

OBS Image

పేతురు వెలుపలకు పోయి సంతాపపడి బిగ్గరగా ఏడ్చాడు. అదే సమయంలో యేసును అప్పగించిన యూదా నాయకులు యేసును శిక్షించడం చూసాడు. అతడు పూర్తి దుఃఖంతో నిండిపోయి వెలుపలికి పోయి తనను తాను చంపుకొన్నాడు.

OBS Image

పిలాతు ఆ రాష్ట్రానికి అధిపతి. రోమా ప్రభుత్వంలో ఆయన పని చేయుచున్నాడు. యూదా నాయకులు యేసును అతని వద్దకు తీసుకొని వచ్చారు. యేసును శిక్షించాలని, ఆయనను చంపాలని వారు పిలాతును అడిగారు. “నీవు యూదులకు రాజువా” అని అడిగాడు.

OBS Image

యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, “నీవు సత్యాన్నే పలికావు. అయితే నా రాజ్యం భూసంబంధమైనది కాదు. అలా అయినట్లయితే నా సేవకులు నా నిమిత్తం యుద్ధం చేస్తారు. దేవుని గురించి సత్యం చెప్పడానికి భూమి మీదకు వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరూ సత్యాన్ని వింటారు.” “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు యేసును అడిగాడు.

OBS Image

యేసుతో మాట్లాడిన తరువాత పిలాతు జనసమూహంలోనికి వెళ్లి, “ఈ వ్యక్తి చనిపోయేలా ఇతనిలో ఏ తప్పిదాన్ని నేను కనుగొనలేదు.” అని వారితో చెప్పాడు. అయితే యూదా నాయకులు, జన సమూహం బిగ్గరగా “సిలువ వెయ్యండి” అరిచారు. పిలాతు వారికి జవాబిచ్చాడు, “ఈయన ఏ తప్పిదాన్ని చెయ్యలేదు.” అందుకు వారి మరింత బిగ్గరగా కేకలు వేసాడు. అప్పుడు పిలాతు మూడవసారి ఇలా అన్నాడు, “ఆయనలో ఎటువంటి దోషమూ లేదు.”

OBS Image

ప్రజలలో కలవరం కలుగుతుందని పిలాతు భయపడ్డాడు. కనుక సైనికులు యేసును సిలువ వేయడానికి అనుమతి ఇచ్చాడు. రోమా సైనికులు ఆయనను కొరడాలతో కొట్టారు. ఆయనకు ఒక అంగీని తొడిగారు. ముళ్ళతో అల్లిన కిరీటాన్ని ఆయనకు ధరింప చేసారు. ఆయనను హేళన చేసారు, “చూడండి, యూదులకు రాజు!” అని పలికారు.

మత్తయి 26:57-27:26; మార్కు 14:53-15:15; లూకా 22:54-23:25; యోహాను 18:12-19:16 నుండి బైబిలు కథ