te_obs/content/36.md

4.0 KiB

36. రూపాంతరం

OBS Image

ఒక రోజున ప్రభువైన యేసు తన ముగ్గురు శిష్యులను, పేతురు, యాకోబు, యోహానులను తనతోపాటు వెంటపెట్టుకొని వెళ్ళాడు. (శిష్యుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒకటి కాదు) వారు ఒక కొండ మీదకు ప్రార్థన చెయ్యడానికి వెళ్ళారు.

OBS Image

యేసు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖం సూర్యుని వలే కాంతివంతంగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు తెల్లనివిగా భూమిమీద ఎవ్వరూ చెయ్యలేనివిగా ప్రకాశంగా ఉన్నాయి.

OBS Image

అప్పుడు మోషే, ఏలియాలు ప్రత్యక్షం అయ్యారు. ఈ ఇద్దరు మనుష్యులు అనేక వందలాది సంవత్సరాల క్రితం జీవించారు. వారు యేసుతో ఆయన మరణం గురించి మాట్లాడారు, ఎందుకంటే ఆయన త్వరలో యెరూషలెంలో చనిపోబోతున్నాడు.

OBS Image

మోషే, ఏలియాలు యేసుతో మాట్లాడుతుండగా పేతురుతో ఇలా అన్నాడు, “మనమిక్కడ ఉండడం మంచిది. ఒకటి నీకునూ, ఒకటి మోషేకునూ, ఒకటి ఏలియాకునూ మనం మూడు పర్ణశాలలు కడదాం.” అయితే పేతురు ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు.

OBS Image

పేతురు మాట్లాడుచుండగా ఒక ప్రకాశమానమైన మేఘం కిందకు వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘంలోనుండి ఒక స్వరాన్ని వారు విన్నారు, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను.” ఆ ముగ్గురు శిష్యులు మిక్కిలి భయపడ్డారు, నేలమీద పడిపోయారు.

OBS Image

అప్పడు యేసు వారిని తాకి ఇలా చెప్పాడు, “భయపడకండి. లేవండి.” అప్పుడు వారు చుట్టూ చూచినప్పుడు యేసు తప్ప ఎవరునూ అక్కడ వారికి కనపడలేదు.

OBS Image

యేసునూ, ఆయన ముగ్గురు శిష్యులునూ కొండ దిగి కిందకు వెళ్ళారు. అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “జరిగిన దానిని గురించి ఎవ్వరితోనూ ఏమియూ చెప్పవద్దు, తరువాత మీరు ప్రజలతో చెప్పవచ్చు.”

మత్తయి 17:1-9; మార్కు 9:2-8; లూకా 9:28-36 నుండి బైబిలు కథ