te_obs/content/34.md

6.1 KiB

34. యేసు ఇతర కథలను బోధించడం

OBS Image

దేవుని రాజ్యం గురించి ప్రభువైన యేసు అనేక కథలు చెప్పాడు. ఉదాహరణకు, ఆయన ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యం ఒకడు పొలములో నాటిన ఆవ గింజను పోలి ఉంది. మీకు తెలుసు, ఆవ గింజ విత్తనాలన్నిటిలో అత్యంత చిన్న గింజ.”

OBS Image

“అయితే ఆ ఆవ గింజ మొలిచి పెరిగినప్పుడు అది చెట్లన్నిటిలో అతి పెద్దదిగా ఉంటుంది, పక్షులు సహితం వచ్చి దానిమీద వాలి వాటి కొమ్మలలో గూడు ఏర్పరచుకొంటాయి.”

OBS Image

యేసు మరొక కథ చెప్పాడు, “దేవుని రాజ్యం పులియజేయు పిండి వలే ఉంది, ఒక స్త్రీ దానిని రొట్టెముద్దలో కలిపినప్పుడు అది ఆ ముద్ద అంతటిలో వ్యాపిస్తుంది.”

OBS Image

“దేవుని రాజ్యం ఒకడు తన పొలములో దాచి పెట్టిన ధననిధిలా ఉంది. మరొక వ్యక్తి ఆ ధననిధిని కనుగొని నప్పుడు దానిని పొందాలని కోరుకుంటాడు. కనుక అతడు దానిని తిరిగి దాచియుంచుతాడు, ఆనందంతో నిండియుంటాడు, ఆ పొలమును కొనడానికి తనకున్నదానినంతా అమ్మి ధననిధి ఉన్న పొలమును కొంటాడు.”

OBS Image

“దేవుని రాజ్యము గొప్పవెలగల ముత్యంవలే ఉంది. ముత్యముల వర్తకుడు దానిని చూచినప్పుడు తనకున్న దానినంతా అమ్మి ఆ ముత్యమును కొనును.”

OBS Image

మంచి కార్యాలు చెయ్యడం ద్వారా దేవుడు వారిని అంగీకరిస్తాడని కొందరు తలస్తారు. ఈ వ్యక్తులు ఆ మంచి కార్యాలు చెయ్యని ఇతరులను తృణీకరిస్తారు, కనుక యేసు వారికి ఒక కథ చెప్పాడు: “ఇద్దరు మనుష్యులు ఉన్నారు, పార్థన చెయ్యడానికి ఇద్దరూ దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు సుంకం వసూలు చేసేవాడు, ఒకడు మత నాయకుడు.”

OBS Image

“మతసంబంధ నాయకుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ‘దేవా నేను ఇటువంటి పాపిలా లేనందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాడు-నేను బందిపోటును కాను, దుర్నీతిపరుడను కాను, వ్యభిచారుడను కాను, ఇక్కడ ఉన్న ఈ సుంకం వసూలు చేసేవాడులాంటి వాడనూ కాను.”

OBS Image

“ఉదాహరణకు, వారంలో రెండు దినాలు ఉపవాసం ఉంటాను, నా రాబడిలోనూ, ఆస్తిలోనూ దశమ భాగం ఇస్తాను.”

OBS Image

“అయితే సుంకం వసూలుదారుడు మతనాయకునికి దూరం నిలిచాడు, ఆకాశం వైపుకు కన్నులు ఎత్తడానికి సహితం భయపడ్డాడు. దానికి బదులు, అతడు తన రొమ్మును చేతితో కొట్టుకొంటున్నాడు, దేవునికి ఇలా ప్రార్థన చేసాడు, ‘దేవా పాపినైన నాయందు కనికరించు.”

OBS Image

అప్పుడు ప్రభువు ఇలా చెప్పాడు, “నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, దేవుడు సుంకం వసూలుదారుని ప్రార్థన విన్నాడు, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అయితే మతనాయకుని ప్రార్థన ఇష్టపడలేదు. దేవుడు గర్విష్టులను గౌరవించడు, అయితే తమను తాము తగ్గించుకోనే వారిని ఆయన ఘనపరుస్తాడు.

మత్తయి 13:31-33, 44-46; మార్కు 4:30-31; లూకా 13:18-21; 18:9-14 నుండి బైబిలు కథ