te_obs/content/33.md

6.3 KiB

33. వ్యవసాయకుని కథ

OBS Image

ఒక రోజు యేసు ఒక సరస్సు తీరాన్న ఉన్నాడు. గొప్ప జనసమూహాలకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధ వినడానికి అనేకులు ఆయన వద్దకు వస్తున్నారు. వారందరితో మాట్లాడడానికి సరియైన స్థలం లేదు. కనుక ఆయన ఒక దోనేలోనికి ఎక్కాడు. ఆయన అక్కడ కూర్చుండి ప్రజలకు బోధించడం ఆరంభించాడు.

OBS Image

ప్రభువైన యేసు వారితో ఒక కథను చెప్పాడు. “ఒక వ్యవసాయకుడు తన పొలములో విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు మార్గమధ్యలో పడ్డాయి. అయితే పక్షులు వచ్చి ఆ విత్తనాలన్నిటినీ తిని వేసాయి.”

OBS Image

“కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, అక్కడ మన్నులేని రాతి నేల. రాతి నేల మీద పడిన విత్తనాలు త్వరగా మొలిచాయి, అయితే వాటి వేరులు మన్నులోనికి లోతుగా వెళ్ళలేక పోయాయి. సూర్యుడు వచ్చినప్పుడు దాని వేడిమికి మొక్కలు ఎండిపోయి చనిపోయాయి.”

OBS Image

“ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి. ఆ విత్తనాలు మొలకెత్తాయి, అయితే ముళ్ళ పొదలు వాటి మీద పెరిగి వాటిని అణచివేసాయి. అందుచేత ముళ్ళపొదలలో పడిన విత్తనాలు మొక్కలుగా పెరగలేదు.”

OBS Image

“కొన్ని విత్తనాలు మంచి నేలమీద పడ్డాయి. ఈ విత్తనాలు పెరిగి పెద్డై అవి ముప్పదంతలుగానూ, ఆరవదంతలుగానూ, నూరంతలుగానూ ఫలాన్ని ఇచ్చాయి. దేవుణ్ణి అనుసరించాలని కోరుకున్నవారు నా మాటలను శ్రద్ధగా ఆలకించాలి.”

OBS Image

ఈ కథ శిష్యులను చాలా కలవరపరచింది. కాబట్టి యేసు వారికి వివరించాడు, “విత్తనం దేవుని వాక్యం. విత్తనాలు మార్గమధ్యలో పడడం, దేవుని వాక్యాన్ని విని దానిని అర్థం చేసుకోనివారుగా ఉంటారు. శత్రువు వారినుండి వాక్యాన్ని ఎత్తికొని వెళ్తాడు. వారు వాక్యాన్ని అర్థం చేసుకొకుండా సాతాను చేస్తాడు.”

OBS Image

“రాతి నేల దేవుని వాక్యాన్ని విని దానిని ఆనందంతో అంగీకరించిన వ్యక్తిని సూచిస్తుంది. అయితే కష్టాలు కలిగినప్పుడు లేక ఇతరుల అతనికి శ్రమలు కల్గిస్తున్నప్పుడు వాడు దేవుని నుండి దూరం అవుతాడు. అంటే దేవునిలో విశ్వాసం ఉంచడం నిలిపివేస్తారు.”

OBS Image

“ముళ్ళపొదలలో విత్తనం పడడం, దేవుని వాక్యాన్ని వినిన వ్యక్తి అనేక ఇతర విషయాల మీద ఆందోళన పడే వ్యక్తిని సూచిస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు, అనేక వస్తువులను సంపాదించుకోడానికి ప్రయత్నిస్తాడు. కొంత కాలం జరిగిన తరువాత దేవున్ని ప్రేమించలేదు. దేవుని నుండి నేర్చుకొన్న దానిని బట్టి ఆయనను సంతోషపరచలేకపోతాడు. విత్తనాలను ఉత్పత్తి చెయ్యలేని గోధుమకాడల వలే ఉంటాయి.

OBS Image

“అయితే మంచి నేలను పడిన విత్తనం, దేవుని వాక్యాన్ని విని, దానిని విశ్వసించి, ఫలాన్ని కలిగించే మనుష్యుని పోలి ఉంది.”

మత్తయి 13:1-8, 18-13; మార్కు 4:1-8, 13-20; లూకా 8:4-15 నుండి బైబిలు కథ