te_obs/content/30.md

5.2 KiB

30. ప్రభువైన యేసు ఐదు వేలమందికి ఆహారం పెట్టడ్డం

OBS Image

ప్రభువైన యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికీ, దేవుని వాక్యాన్ని బోధించడానికీ యేసు తన అపొస్తలులను అనేక గ్రామాలకు పంపాడు. వారు యేసు ఉన్న చోటకు తిరిగివచ్చినప్పుడు, వారు చేసినదాన్నంతటిని యేసుతో చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోడానికి సరస్సు అవతలి వైపుకు వెళ్ళమని ప్రభువు వారితో చెప్పాడు. అందువల్ల, వారు ఒక పదవ ఎక్కి సరస్సుకు ఆవలి వైపుకు వెళ్లారు.

OBS Image

అయితే అనేకులు యేసునూ, ఆయన శిష్యులనూ పడవలో ఉండడం చూచారు. ఈ ప్రజలు సరస్సు ఒడ్డునుండి నది ఆవలి వైపుకు పరుగెత్తి వారికి ముందుగా వెళ్ళారు. కాబట్టి యేసు, ఆయన శిష్యులు వచ్చినప్పుడు, ఒక పెద్ద సమూహం అక్కడ అప్పటికే ఉంది, వారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

OBS Image

ఈ గుంపులో 5,000 మందికి పైగా పురుషులు ఉన్నారు, మహిళలు, పిల్లలను లెక్కించలేదు. ప్రభువు వారిపై కనికరపడ్డాడు. ప్రజలు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నారని ప్రభువుకు కనిపించింది. కనుక ఆయన వారికి బోధించి, వారిలో వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరిచాడు.

OBS Image

తరువాత ఆయన శిష్యులు ప్రభువుతో ఇలా చెప్పారు, “ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, సమీపంలో ఎటువంటి పట్టణాలూ లేవు. వారు ఏమైనా భుజించుటకు వారిని పంపించివెయ్యి.”

OBS Image

అయితే యేసు తన శిష్యులతో, "వారు తినడానికి మీరే ఏదైనా ఇవ్వండి అన్నాడు. వారు "మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు.

OBS Image

యేసు తన శిష్యులతో, ప్రజలందరూ నేలపై గడ్డి మీద ఒక్కొక్క గుంపులో యాభై మంది చొప్పుల కూర్చుండాలని చెప్పాడు.

OBS Image

అప్పుడు యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి చూసి ఆ ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు.

OBS Image

అప్పుడు యేసు ఆ రొట్టెలనూ, చేపలనూ విరిచి ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఆహారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టారు. అవి తరిగి పోలేదు. ప్రజలంతా తిని, సంతృప్తి చెందారు.

OBS Image

ఆ తరువాత, శిష్యులు మిగిలిన ఆహారాన్ని సేకరించారు. అది పన్నెండు గంపలు అయ్యింది. ఆ ఆహారం అంతా ఐదు రొట్టెలు, రెండు చేపల నుండి వచ్చింది.

మత్తయి 14:13-21; మార్కు 6:31-44; లూకా 9:10-17; యోహాను 6:5-15 నుండి బైబిలు కథ