te_obs/content/29.md

5.3 KiB
Raw Permalink Blame History

29. దయలేని సేవకుని కథ

OBS Image

ఒకరోజు శిష్యుడైన పేతురు పభువును ఇలా అడిగాడు, “ప్రభూ, నేను నా సహోదరుడు నా యెడల తప్పిదం చేసినప్పుడు అతడిని ఎన్ని సార్లు క్షమించాలి? ఏడుసార్లు మట్టుకా?” యేసు ఇలా జవాబిచ్చాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు మార్లు మట్టుకు.” దీనిని బట్టి మనం ఎల్లప్పుడూ క్షమించాలని ప్రభువు చెపుతున్నాడు. అప్పుడు ప్రభువైన యేసు ఈ కథ చెప్పాడు.

OBS Image

యేసు ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యం తన సేవకులకు తగిన జీతం ఇవ్వడాలని కోరిన ఒక రాజును పోలియుంది. ఆయన సేవకులలో ఒకడు రాజుకు 200, 000 సంవత్సరాల వేతనంతో సమానమైన పెద్దమొత్తం రుణపడి యున్నాడు.

OBS Image

“అయితే ఆ సేవకుడు తన అప్పు చెల్లించలేక పోయినందున ఆ రాజు తన సేవకులతో, “ఇతనినీ, ఇతని కుటుంబాన్ని ఆమ్మి ఇతని అప్పు తీర్చండి.” అని చెప్పాడు.

OBS Image

“ఆ సేవకుడు రాజు యెదుట మోకరించి ఇలా మనవి చేసాడు, “నా యందు దయ ఉంచుము, నీకు అచ్చియున్న రుణాన్ని మొత్తం నీకు చచెల్లిస్తాను” అయితే రాజు ఆ సేవకుని పట్ల జాలి చూపించాడు, కనుక అతడు అచ్చియున్న అప్పును మొత్తం రద్దు చేసాడు.

OBS Image

“అయితే ఈ సేవకుడు రాజు సన్నిధినుండి బయటకు వెళ్లి తనకు నాలుగు నెలలకు తగిన వేతనంతో సమానమైన అప్పును తీసుకొన్న తన తోటి సేవకుడిని చూచి అతనిని గట్టిగా పట్టుకొని వాడితో, “నాకు అప్పుగా ఉన్న ధనాన్ని వెంటనే చెల్లించు” అని గట్టిగా చెప్పాడు.

OBS Image

తన తోటి సేవకుడు అతని కాళ్ళ మీదపడి ‘దయచేసి నా మీద దయ ఉంచుము, నేను నీకు పూర్తి అప్పును చెల్లించెదను. అని బతిమాలాడు, అయితే ఆ మొదటి సేవకుడు తన తోటి సేవకుడిని ఆఖరు నాణెం చెల్లించేవరకూ తనిని చెరసాలలో వేయించాడు.

OBS Image

“ఇతర సేవకులు జరిగిన దానిని చూచి చాలా కలవరపడ్డారు. వారు రాజు వద్దకు వెళ్లి జరిగిన దాన్నంతటినీ రాజుతో చెప్పారు.”

OBS Image

“రాజు ఆ మొదటి సేవకుడిని పిలిపించాడు, అతనితో ఇలా చెప్పాడు, “దుష్టుడైన చెడ్డ దాసుడా! నీవు నన్ను వేడుకొన్నందుకు నేను నిన్ను క్షమించాను. నీవునూ అదే క్షమాపణ చూపించాలి గదా.” రాజు చాలా కోపగించుకొన్నాడు, ఆ చెడ్డ దాసుడిని చెరసాలలో అతడు తన అప్పును చెల్లించు వరకూ వేయించాడు.”

OBS Image

అప్పుడు యేసు ఇలా చెప్పాడు, “నీ హృదయంలో నుండి నీవు నీ సహోదరుని క్షమించని యెడల నీకునూ ఈవిధంగానే జరుగుతుంది.”

మత్తయి 18:21-35 నుండి బైబిలు కథ