te_obs/content/27.md

7.2 KiB

27. మంచి సమరయుని కథ

OBS Image

ఒక రోజు, యూదా ధర్మ శాస్త్రంలో నిపుణుడు యేసు నొద్దకు వచ్చాడు. యేసు తప్పుగా బోధిస్తున్నాడని అందరికీ రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడిలా అన్నాడు, “బోధకుడా, నిత్యజీవానికి వారసుడవడానికి నేనేమి చెయ్యాలి?” యేసు ఇలా జవాబిచ్చాడు, “దేవుని ధర్మశాస్త్రంలో రాసియన్న దేమిటి?”

OBS Image

అప్పుడా ధర్మశాస్త్రోపదేశకుడు ఇలా చెప్పాడు, “దేవుని వాక్యం ఇలా చెపుతుంది, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించవలయును, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించవలయును.” యేసు ఇలా జవాబిచ్చాడు, “నీవు సరిగా చెప్పావు! ఈ విధంగా చేస్తే నిత్యజీవాన్ని పొందుతావు.”

OBS Image

అయితే ధర్మశాస్త్రోపదేశకుడు తాను నీతిమంతుడనని చూపించుకోవాలని కోరాడు. కనుక యేసును ఇలా అడిగాడు, “అయితే నా పొరుగువాడు ఎవడు?”

OBS Image

ప్రభువైన యేసు ఆ ఉపదేశకునికి ఒక ఉపమానం చెప్పడం ద్వారా జవాబిచ్చాడు, “ఒక యూదుడు యెరూషలెం నుండి యెరికో వైపుకు ప్రయాణం చేస్తున్నాడు.”

OBS Image

“అయితే దొంగలు అతనిని చూచారు, అతని మీద దాడి చేసి అతనిని గాయపరచారు. అతని వద్ద ఉన్నవాటన్నిటినీ తీసుకొని కొనప్రాణం వరకూ అతనిని కొట్టారు. అప్పుడు వారు వెళ్ళిపోయారు.”

OBS Image

“అది జరిగిన తరువాత, ఒక యూదా మత యాజకుడు అదే మార్గంలోని నడుస్తూ వచ్చాడు. యాజకుడు ఆ వ్యక్తి మార్గంలో పడిపోవడం చూసాడు. అతడు ఆ వ్యక్తిని చూచినప్పుడు ఆ దారిలో మరొక మార్గం నుండి వెళ్లి పోయాడు. యాజకుడు ఆ వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యపెట్టాడు.

OBS Image

“కొంచెం సేపు అయిన తరువాత ఒక లేవీయుడు ఆ మార్గం నుండి వచ్చాడు. (లేవీయులు దేవాలయంలో యాజకులకు సహాయం చేసే గోత్రం). లేవీయుడు ఆ మార్గంలో మరొక వైపునుండి ఆ వ్యక్తిని దాటి వెళ్ళాడు. లేవీయుడు కూడా ఆ వ్యక్తిని నిర్లక్ష్యపెట్టాడు.

OBS Image

తరువాత మరొక వ్యక్తి ఆ మార్గంనుండి నడుస్తూ వచ్చాడు. అతడు సమరయ ప్రాంతం వాడు. (సమరయులు, యూదులు ఒకరినొకరు ద్వేషించుకొంటారు). సమరయుడు మార్గంలో పడియున్న వ్యక్తిని చూచాడు. అతడు యూదుడని గుర్తించాడు. అయినప్పటికీ సమరయుడు అతని పట్ల కనికరాన్ని చూపించాడు. అతని వద్దకు వెళ్ళాడు, అతని దెబ్బలకు మందు రాసాడు, పరిచర్య చేసాడు.”

OBS Image

“అప్పుడు ఆ సమరయుడు ఆ వ్యక్తి ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకొన్నాడు. అతడిని ఒక సత్రానికినికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతనిని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు.

OBS Image

“తరువాత రోజు సమరయుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తి కోసం ఆ సత్రపు యజమానికి కొంత సొమ్ము చెల్లించాడు. ఇలా అన్నాడు, “ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూచుకోండి, ఇతని విషయంలో ఇంకనూ ఖర్చు చేసిన యెడల నేను తిరిగి వచ్చినప్పుడు దానిని నేను చెల్లిస్తాను.”

OBS Image

ప్రభువైన యేసు ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగాడు, “నీవేమి అనుకొంటున్నావు? బందిపోటుల చేత దోచుకోబడి కొట్టబడిన వ్యక్తికి ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన పొరుగువాడు?” అతడిలా జవాబిచ్చాడు, “అతని పట్ల జాలి చూపినవాడే!” అందుకు యేసు అతనితో “వెళ్ళు, నీవునూ అదే చెయ్యి” అని చెప్పాడు.

లూకా 10:25-37 నుండి బైబిలు కథ