te_obs/content/25.md

4.0 KiB

25. సాతాను యేసును శోధించడం

OBS Image

ప్రభువైన యేసు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యం లోనికి తీసుకొని వెళ్ళాడు, యేసు అక్కడ నలుబది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, సాతాను యేసు వద్దకు వచ్చి ఆయనను పాపం లోనికి పడేలా శోధించాడు.

OBS Image

మొదట సాతాను యేసుతో ఇలా చెప్పాడు, “నీవు నిజముగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను.”

OBS Image

అయితే యేసు సాతానుతో ఇలా సమాధానం ఇచ్చాడు, “దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది. ‘మనుష్యులు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని వాక్యము వలన జీవించును.”

OBS Image

అప్పుడు సాతాను యేసును ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఆయనతో “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుముకుము, ‘దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించగా వారు నీ పాదములకు రాయి తగులకుండ నిన్ను ఎత్తి పట్టుకొంటారు” అని చెప్పాడు.

OBS Image

సాతాను అడిగిన దానిని చెయ్యడం యేసుకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించకూడదు.”

OBS Image

తరువాత సాతాను ప్రభువైన యేసుకు ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడు. ఆవి ఎంత శక్తివంతమైనవో ఎంత సంపదలతో కూడుకొన్నవో చూపించాడు. ప్రభువుతో ఇలా చెప్పాడు, “నీవు నాకు మొక్కి నన్ను ఆరాధిస్తే నేను వాటిని నీకు దయచేస్తాను.”

OBS Image

ప్రభువైన యేసు ఇలా సమాధాన మిచ్చాడు, “సాతానా నన్ను విడిచి పొమ్ము! ‘నీ ప్రభువైన దేవుని మాత్రమే నీవు పూజించాలి’ అని రాయబడియున్నది.”

OBS Image

సాతాను శోధనలలో యేసు పడిపోలేదు. కనుక సాతాను ఆయనను విడిచిపెట్టాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసారు.

మత్తయి 4:1-11; మారు 1:12-13; లూకా 4:1-13 నుండి బైబిలు కథ