te_obs/content/18.md

9.4 KiB

18. విభజించబడిన రాజ్యం

OBS Image

రాజైన దావీదు నలుబది సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత దావీదు చనిపోయాడు. అతని కుమారుడు సొలోమోను రాజ్య పాలన ఆరంభించాడు. దేవుడు తాను సొలోమోను దేవుడు తనకు ఏమి చెయ్యాలని తాను కోరుకుంటున్నాడో దేవుడు అతనిని అడిగాడు. తనను జ్ఞాన వంతుడిగా చెయ్యాలని సొలోమోను అడిగాడు. అతని మనవి దేవునికి ఇష్టం అయ్యింది. కనుక ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతునిగా సొలోమోనును దేవుడు చేసాడు. సొలోమోను అనేక సంగతులను నేర్చుకొన్నాడు. జ్ఞానవంతుడైన పరిపాలకుడు అయ్యాడు. దేవుడు అతన సంపన్నమైన వాడిగా చేసాడు.

OBS Image

యెరూషలెంలో సోలోమోను దేవాలయాన్ని నిర్మించాడు. దీని కోసం తన తండ్రి దావీదు ప్రణాళిక చేసాడు, పరికరాలను సమకూర్చాడు. ఇప్పుడు ప్రజలు ప్రత్యక్షగుడారం లో కాకుండా దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. దేవుడు దిగి వచ్చి దేవాలయంలో నివసిస్తున్నాడు. ఆయన తన ప్రజలతో నివసిస్తున్నాడు.

OBS Image

అయితే సొలోమోను ఇతర దేశాలనుండి వస్తున్న స్త్రీలను ప్రేమిస్తున్నాడు. అనేకమంది స్త్రీలను పెండ్లిచేసుకోవడం ద్వారా దేవునికి అవిధేయత చూపించాడు. వారిలో దాదాపు 1,000 మంది వరకూ ఉన్నారు! వీరిలో అనేకమంది ఇతర దేశాలనుండి వచారు, వారు తమతో పాటు తమ దేవతలనూ దేశంలోనికి తీసుకొనివచ్చారు. వారిని పూజించడం కొనసాగిస్తున్నారు. సొలోమోను వృద్ధుడైనప్పుడు తాను కూడా ఇతర దేవతలను పూజిస్తూ వచ్చాడు.

OBS Image

ఈ కారణంగా దేవుడు సొలోమోను పట్ల కోపగించుకొన్నాడు. దేశాన్ని రెండు దేశాలుగా విడగొట్టడం ద్వారా సొలోమోనును శిక్షిస్తానని చెప్పాడు. సొలోమోను చనిపోయిన తరువాత తాను శిక్షించబోతున్నాడు.

OBS Image

సొలోమోను చనిపోయిన తరువాత అతని కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఇశ్రాయేలు దేశంలోని ప్రజలందరూ ఒకచోటకు చేరి అతనిని రాజుగా అంగీకరించారు. అతని తండ్రి సొలోమోను తమ చేత అధిక పని చేయించేవాడనీ, తమ వద్ద అధిక పన్ను వసూలు చేసేవాడనీ రెహబాముకు పిర్యాదు చేసారు. పనిని తగ్గించమని రెహబాముకు మనవి చేసారు.

OBS Image

అయితే రెహబాము చాలా అజ్ఞానంగా వారికి జవాబు ఇచ్చాడు. అతడిలా అన్నాడు, “నా తండ్రి మిమ్మును పనిలో కష్టపెట్టాడని మీరు చెపుతున్నారు, అయితే ఆయన కంటే ఎక్కువగా మిమ్మును పని చేయిస్తాను. ఆయన కంటే ఎక్కువగా మిమ్మును కష్టపెడతాను.”

OBS Image

రాజు ఈ మాట చెప్పడం ప్రజలు వినినప్పుడు, వారిలో ఎక్కువ మంది రాజును వ్యతిరేకించారు. పది గోత్రాలు రాజును విడిచి పెట్టి వెళ్ళారు; రెండు గోత్రాల ప్రజలు మాత్రమే రాజుతో ఉన్నారు. ఈ రెండు గోత్రాలు తమ్మును తాము యూదా రాజ్యంగా పిలుచుకొన్నారు.

OBS Image

మిగిలిన పది గోత్రాలు యెరోబాము తమ రాజుగా ఉండడానికి అంగీకరించాయి. ఈ పది గోత్రాలు ఉత్తరభాగంలో ఉన్నారు. వారు తమ్మును తాము ఇశ్రాయేలు రాజ్యం అని పిలుచుకొన్నారు.

OBS Image

అయితే యెరోబాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు. ప్రజలు పాపం చేసేలా కారకుడు అయ్యాడు. దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి యూదా రాజ్యంలోని యెరూషలెంలో దేవాలయానికి వెళ్ళలేదు.

OBS Image

యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం ఒకరికి ఒకరు శత్రువులుగా మారారు. తరచుగా ఒకరికొకరు విరోధంగా యుద్ధాలు చేసుకొన్నారు.

OBS Image

ఇశ్రాయేలు నూతన రాజ్యంలో రాజులందరూ దుష్టులుగా ఉన్నారు. వీరిలో అనేకులు ఇతర ఇశ్రాయేలీయుల చేత చంపబడ్డారు. వారి స్థానంలో రాజులు కావడం వారి కోరిక.

OBS Image

ఇశ్రాయేలు దేశంలో అనేకమంది రాజులూ, ప్రజలూ విగ్రహాలను పూజించారు. వారు ఆ విధంగా చేసినప్పుడు వారు తరచుగా వేశ్యలతో పాపం చేసేవారు, కొన్నిసార్లు తమ పిల్లలను సహితం విగ్రహాలకు బలి ఇచ్చేవారు.

OBS Image

యూదా రాజ్యం రాజులు దావీదు సంతానం. వీరిలో కొందరు యధార్ధంగా ఉండేవారు, వారు నీతితో పరిపాలన చేసారు, దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే యూదా రాజులలో అనేకులు దుర్మార్గులు. వారు దుర్మార్గంగా పరిపాలన చేసారు, వారు విగ్రహాలను ఆరాధించారు, వీరిలో కొందరు తమ పిల్లలను తమ దేవతలకు బలిగా అర్పించారు. యూదా రాజ్యంలోని అనేకులు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు, ఇతర దేవుళ్ళను ఆరాధించారు.

1 రాజులు 1-6; 11-12 నుండి బైబిలు కథ