te_obs/content/11.md

37 lines
5.8 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# 11. పస్కా పండుగ
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-01.jpg)
దేవుడు మోషే, ఆహారోనులను ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వాలని చెప్పాడానికి ఫరో వద్దకు పంపాడు. తమ ప్రజలను వెళ్ళనివ్వని యెడల మొదట పుట్టిన సంతానమంతా చనిపోవడం జరుగుతుంది. అంటే, తన సింహాసనం మీద కూర్చున్న ఫరోకు మొదట పుట్టిన సంతానం మొదలుకొని తిరగలి విసిరే పనికత్తెకు మొదట పుట్టిన సంతానం వరకు, పశువుల్లో కూడా తొలి సంతానమంతా చనిపోవడం జరుగుతుంది. అని వారు ఫరోను హెచ్చరించారు. ఈ హెచ్చరికను ఫరో వినినప్పుడు అతడు ఆ మాటను ఇంకా నిరాకరించాడు, దేవునికి విధేయత చూపించడానికి తృణీకరించాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-02.jpg)
తనను విశ్వసించిన ప్రతి ఒక్కరి మొదటి కుమారుడు రక్షించబడే ఏర్పాటును దేవుడు చేసాడు. ప్రతీ ఒక్క కుటుంబం ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్లను ఎంపిక చేసుకోవాలి, దానిని చంపాలి.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-03.jpg)
జంతువు రక్తంలో కొంత తీసుకొని దాని మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ములమీదా పైకమ్మిమీదా పూయాలి అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, ఆ రాత్రే వారు దాన్ని కాల్చి ఆ మాంసం తినాలి . పొంగజేసే పదార్థం లేకుండా చేసిన రొట్టెతోను చేదు కూరాకులతోను దాన్ని తినాలి.  వారు ఆ భోజనం చేసిన వెంటనే ఆ రాత్రి ఐగుప్తును విడిచి వెళ్ళడానికి సిద్ధపడి యుండాలని దేవుడు వారికి చెప్పాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-04.jpg)
దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేసారు. మధ్య రాత్రి దేవుడు ఐగుప్తు అంతటిలోనూ ప్రతీ ప్రథమ సంతానాన్ని హతం చేసాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-05.jpg)
పస్కాపశువు రక్తం తమ ఇంటి ద్వారా బంధాలమీద రాసిన ప్రతీ ఇంటిని దేవుడు దాటి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కరూ భద్రంగా ఉన్నారు. గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి వారు రక్షణ పొందారు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-06.jpg)
అయితే ఐగుప్తీయులు దేవుణ్ణి విశ్వసించలేదు. ఆయన ఆజ్ఞలకు లోబడలేదు. అందుచేత దేవుడు వారు గృహాలను దాటి వెళ్ళలేదు. ఐగుప్తీయులలోని ప్రతీ ప్రథమ సంతానాన్ని దేవుడు హతం చేసాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-07.jpg)
తన సింహాసనం మీద కూర్చుండే చక్రవర్తి మొదలుకొని చెరసాలలో ఉండే ఖైదీ వరకు వాళ్ళకు మొదట పుట్టిన సంతానాన్నంతా, పశువుల తొలిపిల్లలను కూడా, దేవుడు సంహారం చేశాడు. శవం లేని ఇల్లంటూ ఒక్కటీ లేదు, గనుక ఐగుప్తులో గొప్ప ఏడ్పు పుట్టింది.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-11-08.jpg)
 ఆ రాత్రి చక్రవర్తి మోషేనూ అహరోన్నూ పిలిపించి ఇలా అన్నాడు: “మీరూ ఇస్రాయేల్ ప్రజలంతా లేచి నా ప్రజల మధ్యనుంచి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు యెహోవాను ఆరాధించి సేవించండి.  ఐగుప్తు ప్రజలు కూడా ఇశ్రాయేలీయులను వెంటనే వెళ్లిపోవాలని బతిమాలాడారు.
_నిర్గమకా 11:1-12:32 నుండి బైబిలు కథ_