te_obs/content/09.md

10 KiB
Raw Permalink Blame History

9. దేవుడు మోషేను పిలవడం

OBS Image

యోసేపు చనిపోయిన తరువాత అతని బంధువులందరూ ఐగుప్తులో నిలిచిపోయారు.  ఆ విధంగా వాళ్ళు ఆ దేశం నలుమూలలా వ్యాపించారు. వారూ, వారి సంతానం అనేక సంవత్సరాలు అక్కడే కొనసాగారు, వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచారు.

OBS Image

ఇస్రాయేల్ ప్రజ ఫలవంతమై బహు సంతానంతో సంఖ్యలో అధికమై బలం గల జనం అయింది యోసేపు వారికి చేసిన సహాయం విషయంలో ఇక మీదట కృతజ్ఞత చూపించలేదు. ఇశ్రాయేలీయుల విషయంలో వారు భయపడ్డారు, ఎందుకంటే వారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. అందుచేత ఆ కాలంలో ఐగుప్తును పాలిస్తున్న ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులకు దాసులుగా చేసాడు.

OBS Image

ఐగుప్తీయులు అనేక కట్టడాలను నిర్మించదానికి ఇశ్రాయేలీయులను బలవంత పెట్టారు. పూర్తి నగరాలను వారితో కట్టించారు. వారు పడిన కష్టం వారిని మరింత దుఃఖపరచింది. అయితే దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారికి మరింత సంతానం కలిగింది.

OBS Image

ఇశ్రాయేలీయులు తమ సంతానంతో మరింత విస్తరించడం ఫరో చూచాడు. కనుక ఇశ్రాయేలు మగ శిశువులను నైలు నదిలో పవేయడం ద్వారా వారిని చంపివేయాలని ఫరో తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.

OBS Image

ఒక ఇశ్రాయేలు స్త్రీ ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమె, తన భర్తతో కలిసి వారు దాచగలిగినంత కాలం ఆ మగబిడ్డను దాచియుంచారు.

OBS Image

వారు ఆ బిడ్డను ఇంకా దాచిపెట్టలేక వాడికోసం జమ్ము గంప తీసుకొని దానికి జిగట మట్టినీ కీలునూ పూసింది. అందులో ఆ పిల్లవాణ్ణి ఉంచి నది ఒడ్డున ఉన్న జమ్ము గడ్డిలో దాన్ని పెట్టింది. వాడికి ఏం సంభవిస్తుందో చూడడానికి ఆ పిల్లవాడి అక్క కొంత దూరంగా నిలిచి ఉంది.

OBS Image

ఫరో కూతురు నదికి స్నానానికి వచ్చింది. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె అక్కడి తుంగలో ఆ జమ్ము గంపను చూచి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. దాన్ని తెరచి ఆ పిల్లవాణ్ణి చూచింది. వాడు ఏడుస్తున్నాడు. ఆమెకు వాడిమీద జాలి వేసింది. ఒక ఇశ్రాయేలు స్త్రీని ఆ పిల్లవాడికి దాదిగా ఉంచింది. ఆమె ఆ పిల్లవాని తల్లి అని ఆమెకు తెలియదు. తల్లిపాలు అవసరంలేనంత వరకు ఆ పిల్లవాడు పెరిగిన తరవాత ఆమె అతణ్ణి ఫరో కూతురు దగ్గరకు తీసుకువచ్చింది. అతడు చక్రవర్తి కూతురికి పెంపుడు కొడుకు అయ్యాడు. “నీళ్ళలోనుంచి అతణ్ణి తీశాను” అని చెప్పి ఆమె అతనికి ‘మోషే’ అనే పేరు పెట్టింది.

OBS Image

మోషే పెద్దవాడయ్యిన తరువాత ఒక రోజున ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు బానిసను కొట్టడం మోషే చూసాడు, తన తోటి ఇశ్రాయేలీయుడిని కాపాడడానికి మోషే ప్రయత్నించాడు.

OBS Image

అతడు అటూ ఇటూ పారచూచి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఈజిప్టు వాణ్ణి చంపి అతడి శవాన్ని ఇసుకలో కప్పి పెట్టాడు. అయితే ఒకడు మోషే చేసిన దానిని చూచాడు.

OBS Image

మోషే చేసిన పని ఫరోకు తెలిసింది. మోషేను చంపదానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఐగుప్తు నుండి అరణ్యంలోనికి పారిపోయాడు. ఫరో సైనికులు అతనిని కనుగొనలేకపోయారు.

OBS Image

ఐగుప్తునుండి దూరంలో ఉన్న అరణ్యంలో మోషే ఒక గొర్రెల కాపరి అయ్యాడు. ఆ స్థలం నుండి ఒక స్త్రీను మోషే వివాహం చేసుకొన్నాడు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు.

OBS Image

మోషే తన మామ గొర్రెల మందను సంరక్షిస్తున్నాడు. ఒక పొద మండుచుండడం చూచాడు. ఆ పొద కాలిపోకుండా మండుతూ ఉంది. మోషే ఆ పొదవద్దకు వెళ్లి దానిని చూచాడు. మోషే ఆ పొద వద్దకు వెళ్లినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “మోషే నీ చెప్పులు విడువుము, నీవు నిలుచుండిన స్థలం పరిశుద్ధ స్థలం.”

OBS Image

దేవుడు ఇలా చెప్పాడు, “నేను నీ తండ్రి యొక్క దేవుణ్ణి, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిజంగా చూశాను. ఆ దేశంనుంచి విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు నదులై పారుతున్న కనాను దేశానికి వారిని తీసుకు వెళ్ళడానికి దిగివచ్చాను.”

OBS Image

దేవునితో మోషే అన్నాడు, “ఫరో దగ్గరికి వెళ్ళడానికీ ఇస్రాయేలు ప్రజను ఐగుప్తు నుంచి తీసుకు రావడానికీ నేను ఏపాటివాణ్ణి? వారు నన్ను ‘ఆయన పేరేమిటి? అని అడగవచ్చు. అలాంటప్పుడు వారితో నేనేం చెప్పాలి?” అన్నాడు.  దేవుడు మోషేకు జవాబిస్తూ “నేను శాశ్వతంగా ఉన్నవాడను” అన్నాడు. ఆయన ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేలు ప్రజతో ‘ఉన్నవాడు’ నన్ను మీ దగ్గరికి పంపాడు అనాలి.”  ‘మీ దగ్గరికి నన్ను పంపినది యెహోవా, మీ పూర్వీకుల దేవుడు అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు,

OBS Image

మోషే భయపడ్డాడు, ఫరో వద్దకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే తాను సరిగా మాట్లాడలేడు. కనుక దేవుడు మోషే సహోదరుడిని, ఆహారోనును అతనితో పాటు పంపాడు.

నిర్గమకాండం 1-4 నుండి బైబిలు కథ