te_obs/content/07.md

7.2 KiB

7. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు

OBS Image

ఆ పిల్లవారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు నేర్పుగల వేటగాడై మైదానాల్లో తిరుగుతూ ఉండేవాడు. యాకోబైతే నెమ్మదిపరుడు, డేరాల దగ్గరే ఎప్పుడూ ఉండేవాడు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. 

OBS Image

ఒక రోజు  యాకోబు ఏదో వంటకం వండాడు. అప్పుడే ఏశావు చాలా అలసిపోయి మైదానం నుంచి వచ్చాడు.  యాకోబుతో “అబ్బ, నేను చాలా అలసిపొయ్యాను. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదాంట్లో కొద్దిగా తీసుకోనియ్యి” అన్నాడు ఏశావు. అప్పుడు  యాకోబు అన్నాడు “మొదట నీ జన్మహక్కు నాకు అమ్మివేయి, ఎందుకంటే నీవు మొదట పుట్టావు, దానినంతటినీ నాకు ఇచ్చి వెయ్యి.” కాబట్టి ఏశావు తనకున్న దాన్నంతటినీ ఇస్తానని వాగ్దానం చేసాడు. అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టె, సిద్ధం చేసిన వంటకం పెట్టాడు.

OBS Image

ఇస్సాకు తన ఆశీర్వాదాలను ఏశావుకు ఇవ్వాలని కోరాడు. అది చెయ్యడానికి ముందు రిబ్కా, యాకోబులు ఇస్సాకును మోసగించారు, యాకోబు తన అన్న అయిన ఏశావులా నటించాడు. ఇస్సాకు కండ్లు మసకబారాయి. చూపులేని వయోవృద్ధుడైపోయాడు. కనుక యాకోబు ఏశావు దుస్తులు ధరించి, తన మెడ మీదా, చేతుల మీద గొర్రె చర్మాన్ని ధరించాడు.

OBS Image

అప్పుడు తన తల్లి సిద్ధం సిద్ధం చేసిన రుచిగల వంటకం, రొట్టెను తీసికొని యాకోబు తన తండ్రి ఇస్సాకు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “నాన్నగారూ, నేను నీ పెద్ద కొడుకు ఏశావును. నువ్వు నాతో చెప్పినట్టే చేశాను. నువ్వు నన్ను దీవించేలా లేచి, కూచుని, నేను తెచ్చిన మాంసం తిను.” అది ఏశావు అని తలంచి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.

OBS Image

జ్యేష్టకుమారునిగా తన జన్మ హక్కునూ, తన ఆశీర్వాదాలన్నిటినీ యాకోబు దొంగిలించినందుకు అతని పట్ల ఏశావు ద్వేషాన్ని పెంచుకొన్నాడు. తన తండ్రి చనిపోయిన తరువాత యాకోబును చంపాలని ప్రణాళిక వేసుకొన్నాడు.

OBS Image

అయితే రిబ్కా ఏశావు ప్రణాళికను గురించి విన్నది. తానునూ తన భర్త ఇస్సాకును కలిసి యాకోబును తన బంధువుల వద్దకు దూర ప్రదేశానికి పంపించివేశారు.

OBS Image

రిబ్కా బంధువుల వద్ద యాకోబు అనేక సంవత్సరాలు నివసించాడు. ఆ కాలంలో యాకోబు వివాహం చేసుకొన్నాడు, వారికి పన్నెండు మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. దేవుడు యాకోబును అత్యంత సంపద కలిగిన వానిగా చేసాడు.

OBS Image

కనానులోని తన ఇంటినుండి బయటకు వచ్చిన 20 సంవత్సరాల తరువాత యాకోబు తన కుటుంబంతోనూ, సేవకులతోనూ, తన పశుసంపద అంతటితోనూ స్వదేశానికి తిరిగి వచ్చాడు.

OBS Image

ఏశావు తనను ఇంకా చంపాలని తిరుగుతున్నాడని యాకోబు చాలా భయపడ్డాడు. కాబట్టి యాకోబు గొప్ప పశు సంపదను బహుమతిగా ఏశావు వద్దకు పంపాడు. ఈ బహుమతులను తీసుకొని సేవకులు ఏశావు వద్దకు వెళ్లి ఇలా అన్నారు, “నీ సేవకుడు యాకోబు ఈ బహుమతులు నీకిచ్చాడు, అతడు నీ వద్దకు వస్తున్నాడు.”

OBS Image

అయితే ఏశావు యాకోబు చంపాలని అనుకోవడం లేదు. దానికి బదులు తన సోదరుడు యాకోబు చూచినందుకు ఏశావు బహుగా సంతోషించాడు. యాకోబు నెమ్మదితో కనానులో నివసించాడు. అప్పుడు ఇస్సాకు చనిపోయాడు. యాకోబు, ఎశావులు అతనిని సమాధి చేసారు. దేవుడు అబ్రాహముతో చేసిన నిబంధన ఇస్సాకునుండి యాకోబుకు వచ్చింది.

ఆదికాండం 25:27-35:29 నుండి బైబిలు కథ