te_obs/content/03.md

11 KiB

3. జలప్రళయం

OBS Image

చాలాకాలం తరువాత లోకంలో జనాభా విస్తరించింది. వారు చాలా దుర్మార్గంగానూ, హింసాత్మకంగానూ తయారయ్యారు. మనుషుల చెడుతనం లోకంలో అధికం కావడం చేత దేవుడు లోకం అంతటినీ ఒక పెద్ద జలప్రళయం ద్వారా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.

OBS Image

నోవహును బట్టి దేవుడు సంతోషించాడు, నోవహు తన తరం వారిలో న్యాయవంతుడూ, నిందారహితుడూ, దుష్టులైన ప్రజల మధ్య జీవిస్తున్నాడు.  దేవుడు నోవహుతో తాను ఒక గొప్ప జలప్రళయంతో భూమిని నాశనం చెయ్యబోతున్నట్టు చెప్పాడు. కనుక ఒక పెద్ద ఓడను చెయ్యమని నోవహుతో చెప్పాడు.

OBS Image

ఆ ఓడ పొడుగు మూడు వందల మూరలు, వెడల్పు యాభై మూరల. ఎత్తు ముప్ఫయి మూరల. కొలతతో దానిని నిర్మించాలని దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహును ఓడను మ్రానుతో మూడంతస్తులుగా కట్టాడు, దానిలో అనేక గదులూ, ఒక కప్పు భాగం, ఒక కిటికీని ఉంచాడు. నోవహూ, అతని కుటుంబం, ప్రతివిధమైన భూజంతువూ జలప్రళయం సమయంలో ఓడ వారిని క్షేమంగా ఉంచుతుంది.

OBS Image

నోవహు దేవునికి లోబడ్డాడు. దేవుడు వారికి చెప్పిన విధంగా నోవహూ, అతని కుమారులు ఓడను కట్టారు. ఓడ కట్టడానికి చాలా సమయం పట్టింది. ఎదుకంటే అది చాలా పెద్దది. రాబోతున్న జలప్రళయం గురించి నోవహు మనుష్యులందరితోనూ చెప్పాడు, దేవుని వైపు తిరగాలని చెప్పాడు, అయితే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు.

OBS Image

దేవుడు నోవహుకూ, అతని కుటుంబానికీ వారి కోసం, జంతువులన్నిటి కోసం ప్రతివిధమైన మేతనూ భోజన పదార్థాలనూ కూర్చుకొని వారి వద్ద ఉంచుకోవాలని ఆజ్ఞాపించాడు. సమస్తం సిద్ధం అయిన తరువాత నోవహూ, అతని భార్య; అతని ముగ్గురు కుమారులూ, వారి భార్యలూ ఓడలోనికి ప్రవేశించే సమయం అని నోవహుతో చెప్పాడు-మొత్తం ఎనిమిది మంది.

OBS Image

 దేవుడు ఓడలోనికి వెళ్ళేలా అన్ని రకాల జంతువులలో మగవాటినీ, ఆడవాటినీ, పక్షులను నోవహు వద్దకు పంపాడు. నోవహు వాటిని ఓడలోనికి చేర్చేలా జలప్రళయం సమయంలో అవి క్షేమంగా ఉండేలా వాటిని పంపాడు.  అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ అవి బలియాగం కోసం వినియోగించేలా నోవహు వద్దకు పంపాడు. వారందరూ ఓడలోనికి వచ్చినప్పుడు దేవుడు తానే ఓడ ద్వారాన్ని మూసివేసాడు.

OBS Image

ప్రచండ వర్షం భూమిమీద నలభై రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది జలప్రళయం భూమిమీద నలభై రోజులు ఉంది. సర్వ ప్రపంచం నీటితో నిండిపోయింది. నీళ్ళ లోతు అత్యధికం కావడంచేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగి పొయ్యాయి.

OBS Image

ఆరిన నేలమీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. ఓడ నీటి మీద తేలియాడింది. దానిలోని ప్రతీదీ నీటిలో మునిగిపోకుండా కాపాడబడ్డాయి.

OBS Image

వర్షాలు నిలిచిపోయిన తరువాత, ఓడ నీటి మీద ఐదు నెలలు తేలియాడింది. ఆ సమయంలో నీరు కిందికి ఇంకడం ఆరంభించింది. ఒకరోజు ఓడ ఒక పర్వతం మీద నిలిచింది. అయితే లోకం అంతా ఇంకా నీటితో నిండిపోయింది. మూడు నెలల తరువాత పర్వతాల కొనలు కనిపించాయి.

OBS Image

తరువాత నలుబది రోజులకు నోవాహు కాకిని వెలుపలికి పంపించాడు, లోకం మీద నీరు ఇంకిపోయాయని కనుగొనడానికి నోవహు దానిని పంపాడు. పొడి ప్రదేశం దానికి దొరకని కారణంగా అది తిరిగి లోపలి వచ్చింది.

OBS Image

తరువాత నోవహు ఒక పావురాన్ని పంపాడు. అయితే అది కూడా పొడి ప్రదేశాన్ని కనుగొనలేకపోయింది. నోవహు వద్దకు తిరిగి వచ్చింది. ఒక వారం తరువాత నోవహు దానిని మరల బయటికి పంపాడు. అది తన నోట ఒక ఒలీవ కొమ్మను ఉంచుకొని ఒకలోనికి నోవహు వద్దకు వచ్చింది. నీరు పూర్తిగా ఇంకిపోయాయి. మొక్కలు తిరిగి ఎదగడం ఆరంభం అయ్యాయి.

OBS Image

నోవహు మరొక వారం రోజులు ఎదురుచూచాడు. మూడవసారి పావురాన్ని బయటికి పంపించాడు, అయితే ఈ సారి అది విశ్రమించే చోటు దొరకడం వలన ఓడలోనికి రాలేదు. నీరు పూర్తిగా ఎండిపోయింది!

OBS Image

రెండు నెలలు తరువాత దేవుడు నోవహుతో ఇలా చెప్పాడు, “నీవునూ, నీ కుటుంబమూ, సమస్త జంతువులునూ ఓడలోనుండి వెలుపలికి రండి. సంతానాన్ని కలిగియుండండి, ఫలించి భూమిని నిందించండి.” కనుక నోవహూ, అతని కుటుంబమూ ఓడనుండి బయటికి వచ్చారు.

OBS Image

నోవహు ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత ఒక బలి పీఠాన్ని నిర్మించాడు, ఒక్కొక్క రకం జంతువులలో నుండి బలికి వినియోగించే వాటిని కొన్నింటిని హోమబలిగా అర్పించాడు. ఆ బలులను బట్టి దేవుడు సంతోషించాడు.

OBS Image

దేవుడు ఇలా చెప్పాడు, “మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి ఇక మీదట భూమిని నేను తిరిగి శపించను లేక జలప్రళయాలను రప్పించడం ద్వారా లోకాన్ని నాశనం చెయ్యను, వారు బాల్యము నుండి పాపులుగా ఉన్నారు.”

OBS Image

ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు మొదటి ఇంద్రధనుస్సును చేసాడు. అది ఆకాశంలో కనిపించిన ప్రతీ సారీ దేవుడు తాను వాగ్దానం చేసినదానిని జ్ఞాపకం చెసుకొంటాడు, ఆయన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకొంటారు.

ఆదికాండం 6-8 నుండి బైబిలు కథ