te_obs/content/02.md

54 lines
8.4 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# 2. పాపం లోకం లోకి ప్రవేశించింది
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-01.jpg)
ఆదాము, హవ్వలు దేవుడు వారికోసం తయారు చేసిన అందమైన ఏదెనులో సంతోషంగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికీ దుస్తులు లేవు. అయితే ఇది వారు సిగ్గుపడేలా చెయ్యలేదు, ఎందుకంటే లోకంలో పాపం లేదు. వారు తరచుగా తోటలో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-02.jpg)
అయితే తోటలో ఒక సర్పం ఉంది, వాడు చాలా కుయుక్తి కలిగినవాడు. వాడు స్త్రీని ఇలా అడిగాడు. “ఏదెను తోటలో ఏ వృక్ష ఫలములనైనా తినకూడదని దేవుడు చెప్పాడా?”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-03.jpg)
ఆ స్త్రీ ఇలా జవాబిచ్చింది. “ఈ తోటలో ఏ వృక్ష ఫలములనైనా తనవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే మంచి చెడుల తెలివితేటల నిచ్చు వృక్ష ఫలాలను తినకూడదని చెప్పాడు, ఆలాగు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని చెప్పాడు.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-04.jpg)
సర్పం స్త్రీతో ఇలా అంది, “ఇది సత్యం కాదు! మీరు చావనే చావరు, మీరు ఈ ఫలమును తిను దినమున మీరు దేవుని వలే మారతారనీ, ఆయనకు వలే మంచి చెడులను తెలుసుకొందురని దేవునికి తెలుసు”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-05.jpg)
ఆ స్త్రీ ఆ ఫలములు అందమైనవియునూ, రమ్యమైననవిగానూ ఉన్నాయని చూచింది. జ్ఞానం కలిగియుండాలని వాటిలో కొన్నింటిని తిని తన భార్తకునూ ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-06.jpg)
వెంటనే వారి కన్నులు తెరువబడ్డాయి, వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించారు. అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని వారు తమ దేహాలను కప్పుకోడానికి ప్రయత్నించారు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-07.jpg)
ఆదాము, అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుని స్వరాన్ని విన్నారు, వారిద్దరూ చెట్ల మధ్య దాగుకొన్నారు. అప్పుడు దేవుడు ఆదామును పిలిచాడు, “ఎక్కడ ఉన్నావు?” అన్నాడు. అందుకు ఆదాము ఇలా జవాబిచ్చాడు, “నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, కనుక భయపడి దాగుకొంటిని.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-08.jpg)
అప్పుడు దేవుడు ఇలా అడిగాడు, “నీవు దిగంబరివని నీ తెలిపినవాడెవడు? నీవు తినకూడడని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా?” ఆదాము ఇలా జవాబిచ్చాడు, “నాతో ఉండుటకు నీ నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకివ్వగా నేను తిన్నాను.” అప్పుడు దేవుడు స్త్రీతో నీవు చేసినది ఏమిటి? అని అడిగాడు?” ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అని జవాబు చెప్పింది.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-09.jpg)
అందుకు దేవుడు సర్పముతో, “నీవు శపించబడ్డావు. నీ కడుపుతో ప్రాకుతూ మన్ను తింటావు, నీవునూ స్త్రీకినీ నీ సంతానమునకునూ ఆమె సంతానమునకునూ వైరము కలుగజేసెదను. స్త్రీ సంతానము నిన్ను కొట్టును నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” అని చెప్పాడు.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-10.jpg)
ఆ స్త్రీతో దేవుడన్నాడు, “ నీ ప్రసవ వేదనను నేను తప్పక అధికం చేస్తాను. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలుతాడు.”
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-11.jpg)
ఆ మనిషితో దేవుడు అన్నాడు: “నీవు నీ భార్య మాట విని, నేను నీకాజ్ఞాపించి ‘తినవద్ద’న్న చెట్టు ఫలాన్ని తిన్నావు, గనుక నీకోసం భూమి శాపానికి గురి అయింది .నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు. నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది, నిన్నునేలనుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకూ ఇలాగే ఉంటుంది. నీవుమట్టివి; మట్టికి తిరిగి పోతావు.” ఆదాము తన భార్యకు “హవ్వ” అని పేరు పెట్టాడు, ఎందుకంటే ప్రాణం ఉన్న మానవ జాతి అంతటికీ ఆమె తల్లి.
![OBS Image](https://cdn.door43.org/obs/jpg/360px/obs-en-02-12.jpg)
అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో, ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మనవంటివాడయ్యాడు. ఇప్పుడతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకొని, తిని శాశ్వతంగా బ్రతకకూడదు. అందుచేత దేవుడు అతణ్ణి ఏదెను తోటనుంచి పంపివేసాడు. జీవవృక్షం ఫలాలను తినకుండా ఉండడానికి జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి శక్తివంతమైన దేవదూతలను ఉంచాడు.
_ఆదికా 3 నుండి బైబిలు కథ_