te_obs-tn/content/43/11.md

1.9 KiB

నామంలో

ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. “అధికారము చేత”, “అధికారం కింద.” మీ భాషలో ఈ విధంగా అర్థం అయినట్లే “నామం” అనే పదాన్ని అక్షరార్ధంగా అనువదించడానికి ఆలోచన చెయ్యండి.

క్రీస్తు

దీనికి “మెస్సీయ” అనే అర్థం ఉంది. “అభిషిక్తుడైన వాడు” అని లేదా “ఏర్పాటు చెయ్యబడినవాడు” అని అనువదించవచ్చు. కొంతమంది అనువాదకులు “క్రీస్తు” అని పదాన్ని ఉంచడానికే యెంచుకొంటారు, తమ సొంత భాషలోని శబ్దాలలో పలుకుతారు.

యేసు క్రీస్తు

“క్రీస్తు” అనే పదం ఇక్కడ పేరును సూచిస్తుంది కనుక, కొందరు అనువాదకులు క్రమాన్ని మార్పు చెయ్యడానికి చూస్తారు, “క్రీస్తు యేసు” అని పలుకుతారు. రెండు క్రమాలు బైబిలులో వినియోగించబడ్డాయి.

అనువాదం పదాలు