te_obs-tn/content/40/07.md

1.8 KiB

సమాప్తమైంది!

"పూర్తయింది", లేదా "నేను పూర్తి చేశాను", లేదా "నేను పనిని పూర్తి చేసాను" అని కూడా దీనిని అనువదించవచ్చు. రక్షణకు సంబంధించిన యేసు చేసిన పని పూర్తయిందని దీని అర్థం.

నీ చేతుల్లోకి

అంటే, "నీ వశంలోకి."

తల వాల్చాడు

అంటే, "తన తలను వంచాడు."

తన ఆత్మను అప్పగించుకున్నాడు

అంటే, "తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు" లేదా, "తన ఆత్మను దేవునికి విడిచిపెట్టి, మరణించాడు."

పెద్ద తెర

ఇది ఆలయంలో వేలాడదీసిన పెద్దదైన, ఒక బలమైన అల్లిక వస్త్రం. ఇది ఒక గదిని, మరొక గది నుంఛి వేరుచేసే గోడలా, అడ్డంగా ఉంది. దీనిని "మందపాటి పరదా" లేదా, "వ్రేలాడుతున్న అల్లిక వస్త్రం" లేదా, "తెర" అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు