te_obs-tn/content/39/04.md

3.3 KiB

నేను

అంటే, "మీరు చెప్పినట్లే" లేదా, "నేను దేవుని కుమారుడైన మెస్సీయను." “నేను" అని అంటే దేవుని పేరు కూడా.(చూడండి 09:14). యేసు "నేను” అని చెప్పడం వలన ఆయన కూడా దేవుడనై యున్నానని చెప్తున్నాడు. వీలైతే, యేసు ఇచ్చిన సమాధానానికి, దేవుని పేరుకు మధ్యన ఉన్న సారూప్యతను ప్రజలు చూచే విధంగా అనువదించండి.

దేవునితో కూర్చున్నాడు

దీనిని "దేవునితో పరిపాలించడం" అని అనువదించవచ్చు. ఎందుకంటే దేవుడు అందరికీ పాలకుడు కాబట్టి, ప్రజలు ఆయనను గురించి పరలోకంలో సింహాసనంపై కూర్చున్నట్లు చెబుతారు. తాను దేవునితో కూర్చుంటానని చెప్పడం ద్వారా, తండ్రితో పరిపాలించే అధికారం తనకు ఉందని యేసు పేర్కొన్నాడు.

దేవునితో కూర్చున్నాడు, పరలోకం నుండి వస్తాడు

దీనిని "దేవుని పక్కన కూర్చొన్నాడు, పరలోకం నుండి వస్తున్నాడు" అని అనువదించవచ్చు.

కోపంతో తన బట్టలు చింపివేసాడు

దుఃఖాన్ని లేదా కోపాన్ని ప్రదర్శించేందుకు యూదులు తమ బట్టలు చింపుకుంటారు. బట్టలు చింపివేయడం అంటే మీ భాషలో మరేదైనా పదం ఉంటే, దానిని "అతను చాలా తీవ్రంగా కోపపడ్డాడు" అని ప్రత్యామ్నాయంగా అనువదించవచ్చు.

మీ తీర్పు ఏమిటి?

అంటే, "మీ నిర్ణయం ఏమిటి?" లేదా, "మీరు ఏమి నిర్ణయించుకున్నారో మాకు చెప్పండి: ఆయన నిర్దోషా లేదా దోషా?" దేవునితో సమానుడని చెప్పుకున్నందుకు, ప్రధాన యజకుడూ, మత పెద్దలూ యేసును శిక్షించాలని అనుకున్నారు.

అనువాదం పదాలు