te_obs-tn/content/35/09.md

2.2 KiB

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

కొవ్విన దూడ

ఈ వాక్యాన్ని “కొవ్విన దూడ.” అని అనువదించవచ్చు. ఇది కొవ్వినదిగా ఉంది, దీనిని వండినప్పుడు ఇది చాలా రుచికరంగానూ, శ్రేష్ఠమైనదిగానూ ఉంటుంది.

నీ కుమారుడు చనిపోయాడు, అయితే ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు!

అంటే, “ఇతడు చనిపోయిన నా కుమారుని వలే ఉన్నాడు, ఇప్పుడు మరల బ్రతికాడు” లేక “నా కుమారుడు చనిపోయాడని నేను చాలా దుఃఖపడ్డాను, అయితే ఇప్పుడు నేను సంతోషిస్తున్నాడు, ఎందుకంటే అతడు తిరిగి జీవంలోనికి వచ్చినట్టు ఉంది!” తన చిన్న కుమారుడు ఇంటికి వచ్చిన కారణంగా తాను ఎంత సంతోషంగా ఉన్నాడో చూపించడానికి ఈ మాటలు చెపుతున్నాడు.

అతడు తప్పిపోయాడు, అయితే ఇప్పుడు దొరికాడు!

అంటే, “నేను నా కుమారుడిని కోల్పోయినట్లుగా ఉంది,అయితే నేను ఇప్పుడు అతనిని కనుగొన్నాను.” తన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినందుకు తండ్రి యెంత సంతోషంగా ఉన్నాడో చూపించడానికి ఈ మాటలు చెపుతున్నాడు.

అనువాదం పదాలు