te_obs-tn/content/27/01.md

32 lines
3.0 KiB
Markdown

# ఒక రోజు
ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషల్లో ఒక వాస్తవమైన కథను ఆరంభించేటప్పుడు ఇలాంటి విధానమే ఉంటుంది.
# యూదా ధర్మశాస్తంలో పండితుడు
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈ మనిషి అధ్యయనం చేసాడు, దానిని బోధించాడు. ఇతర యూదా శాసనాలను కూడా అధ్యయనం చేసి బోధించాడు.
# ఆయన శోధించడానికి
అంటే, “యేసు మంచి జవాబు ఇస్తాడని వారు చూడడానికి”
# నిత్యజీవం స్వతంత్రించుకోడానికి
అంటే, “దేవునితో శాశ్వత జీవితం కలిగియుండడానికి” లేక “దేవునితో శాశ్వత కాలం జీవితాన్ని ఆయన ఇవ్వడానికి” లేక “దేవుని నుండి శాశ్వతజీవాన్ని పొందడానికి.” ధర్మ శాస్త్ర పండితుడు తండ్రియైన దేవుని నుండి స్వాస్థ్యంగా నిత్యజీవాన్ని పొందడానికి తాను ఏవిధంగా యోగ్యుడవుతాడని అడుగుతున్నాడు.
# నిత్యజీవం
క్షయమైన దేహం చనిపోయిన తరువాత దేవునితో శాశ్వత జీవితాన్ని ఇది సూచిస్తుంది. నిత్య జీవం కోసం ముఖ్య పదం పుటను చూడండి.
# దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినదేమిటి?
అంటే, “దీని విషయం దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినదేమిటి?” దేవుని ధర్మ శాస్త్రం వాస్తవంగా బోధిస్తున్న దానిని గురించి ఆ బోధకుడు తెలుసుకోవాలని కోరుతున్నాడు కనుక యేసు ఈ ప్రశ్న అడిగాడు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/teacher]]
* [[rc://*/tw/dict/bible/kt/inherit]]
* [[rc://*/tw/dict/bible/kt/eternity]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]