te_obs-tn/content/14/11.md

21 lines
2.2 KiB
Markdown

# దేవుడు వారికి సమకూర్చాడు
ఈ వాక్యాన్ని “దేవుడు వారికి ఆహారం, నీరు, నివాసం కోసం సమస్తం అనుగ్రహించాడు.” అని అనువదించవచ్చు.
# ఆకాశంనుండి ఆహారం, దీనిని “మన్నా” అని పిలుస్తారు.
పలుచగా, రొట్టెలా ఉండే ఈ ఆహారం రాత్రి వేళ ఆకాశం నుండి నేల మీదకు మంచు వలే పడింది. వారు దానిని “మన్నా” అని పిలిచారు. దాదాపు ప్రతీ దినం ప్రజలు దానిని సమకూర్చుకొన్నారు, దానిని ఆహారంగా వండుకొన్నారు.
# ఆయన పూరేడుల గుంపును శిబిరం లోనికి పంపాడు
దీనిని “అధిక సంఖ్యలో పూరేళ్ళు శిబిరంలోనికి ఎగిరి వచ్చేలా దేవుడు చేసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. పూరేళ్ళు అనే పదం తెలియకపోతే అదే రకమైన వేరొక పక్షిని వినియోగించవచ్చు. లేక ఆ పదం “మధ్యరకం బరువు పక్షులు” అని అనువదించవచ్చు.
# వారి శిబిరం
ఇశ్రాయేలీయులు తమ గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకొనే స్థలాన్ని “శిబిరం” అని పిలిచారు. భవనాలకు బదులు గుడారాలు ఉన్న పట్టణంలా ఉంది. అది ముందుకు కదలగల్గుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/israel]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]