te_obs-tn/content/13/05.md

29 lines
2.2 KiB
Markdown

# సమాచారం
దేవుడు మోషేతో మాట్లాడడం కొనసాగించాడు
# నేను యెహోవాను, రోషముగల దేవుడును.
ఈ వాక్యాన్ని “నేను యెహోవాను, నన్ను తప్పించి మరి దేనినైనా మీరు పూజించి, ఘనపరచినట్లయితే నేను కోపగిస్తాను.” అని అనువదించవచ్చు. ఇంకొకదాని కంటే లేక ఇంకొక వ్యక్తికంటే ఆయన ప్రజలు ఆయనను ప్రేమించి, సేవించి ఆయనకు మాత్రమే లోబడి యుండాలని దేవుడు బలంగా అభిలషించాడు.
# నా పేరును వ్యర్ధంగా పలుకకూడదు
ఈ వాక్యాన్ని “గౌరవం, ఘనత చూపించని విధంగా నన్ను గురించి మాట్లాడకూడదు” లేక “నాకు సరైన గౌరవం, ఘనత ఇచ్చేవిధానంలో నన్ను గురించి మాట్లాడాలి” అని అనువదించవచ్చు
# ఏడవ రోజు
ఈ పదాన్ని అనువదించడానికి వారంలో ఒక నిర్దిష్టమైన రోజు పేరును ఇవ్వడం కంటే (“ఏడవ”) సంఖ్యను వినియోగించడం శ్రేష్టం,
# నన్ను జ్ఞాపకం చేసుకోడానికి
“నన్ను మీ మనసులో ఉంచుకోండి” లేక “నన్ను ఘనపరచడానికి” అని అనువాదం చెయ్యవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/idol]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/sabbath]]
* [[rc://*/tw/dict/bible/kt/holy]]