te_obs-tn/content/13/03.md

2.4 KiB

మూడు దినముల తరువాత

మరొక మాటలలో, వారు సీనాయి పర్వతం వద్దకు వచ్చిన మూడు రోజుల తరువాత, దేవుడు మొట్టమొదటిసారి వారితో మాట్లాడాడు

ఆత్మీయంగా తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు

దేవుణ్ణి కలుసుకోవడంలో ఆచార పూర్వకమైన సిద్ధబాటును ఇది సూచిస్తుంది. దీనిని “దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడ్డారు” లేక దేవుణ్ణి కలుసుకోడానికి తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు” అని అనువదించవచ్చు.

పెద్ద బూర శబ్దం

ఈ పదం “ఒక కొమ్మునుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది” లేక “ఒక కొమ్ము ఊదారు, అది ఒక పెద్ద శబ్దం చేసింది” లేక “ఒక కొమ్మునుండి వచ్చిన పెద్ద శబ్దాన్ని వారు విన్నారు” అని అనువదించ వచ్చు. గొర్రెల కొమ్ముల నుండి కొమ్ము బూరలు తయారు చేస్తారు. దేవుణ్ణి కలుసుకోడానికి పర్వతం వద్ద ప్రజలు సమావేశం కావడానికి వాటిని వినియోగించేవారు.

పర్వతం మీదకు మోషే ఒక్కడికి మాత్రమే అనుమతి లభించింది

ఈ వాక్యాన్ని “పర్వతం మీదకు రావడానికి దేవుడు మోషేను అనుమతించాడు, అయితే మరెవరినీ దేవుడు అనుమతించలేదు” అని తర్జుమా చెయ్యవచ్చు.

అనువాదం పదాలు