te_obs-tn/content/08/12.md

25 lines
3.0 KiB
Markdown

# తన సోదరులను పరీక్షిస్తున్నాడు
యోసేపు తన అన్నలను ఇబ్బందికరమైన పరిస్తితులలో ఉంచాడు, వారు తమ కనిష్ట సోదరుడిని కాపాడుతున్నారా లేక తనను చూసిన విధంగానే హీనంగా చూస్తున్నారా అని చూస్తున్నాడు. వారు తమ తమ్ముడిని భద్రంగా చూస్తున్నప్పుడు వారు మార్పు చెందారని యోసేపు చూసాడు.
# వారు మార్పు చెందినప్పుడు
“వారు గతంలో ఉన్నదానికి భిన్నంగా ఉన్నప్పుడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. “అనేక సంవత్సరాల క్రితం యోసేపు సోదరులు అతనిని బానిసత్వం లోనికి అమ్మివేశారు,
# భయపడవద్దు
“నా నుండి ఎటువంటి శిక్షకూ భయపడవలసిన అవసరం లేదు” అని మరొక విధంగా చెప్పవచ్చు. యోసేపు పట్ల వారు ఘోరమైన తప్పిదం చేసారు, ఇప్పుడు యోసేపు ఒక గొప్ప అధికారిగా వారిని శిక్షించడానికి శక్తికలిగినవాడిగా ఉన్న కారణంగా యోసేపు విషయంలో తన సోదరులు భయపడుతున్నారు. యోసేపు వారికి ఆహారాన్ని అమ్మడానికి నిరాకరించవచ్చు, లేక వారిని చెరలో ఉంచవచ్చు లేక చంపవచ్చు.
# మేలు కోసం చెడు
యోసేపు సోదరులు యోసేపును ఒక బానిసగా అమ్మినప్పుడు ఒక చెడు కార్యాన్ని జరిగించారు, యోసేపును ఐగుప్తుకు పంపారు. అయితే కరువు కాలంలో భయంకర కరువునుండి అనేక వేలమందినీ, తన సొంత కుటుంబాన్ని కూడా యోసేపు కాపాడేలా దేవుడు దీనిని అనుమతించాడు. ఇది చాలా మేలుకరమైన అంశం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/josephot]]
* [[rc://*/tw/dict/bible/kt/evil]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/good]]
* [[rc://*/tw/dict/bible/other/egypt]]