te_obs-tn/content/07/06.md

23 lines
1.9 KiB
Markdown

# ఏశావు ప్రణాళిక
తన తండ్రి చనిపోయిన తరువాత యాకోబును చంపాలని ఏశావు ప్రణాళిక.
# ఆమె, ఇస్సాకు యాకోబును పంపించి వేశారు
ఏశావు చేతిలోనుండి యాకోబును కాపాడాలని రిబ్కా కోరింది, కనుక యాకోబును పంపించి వేయాలని ఇస్సాకుతో మాట్లాడింది.
# ఆమె బంధువులతో నివసించడానికి చాలా దూరం
అబ్రహాము సేవకుడు ఇస్సాకుకు భార్యగా తనను తీసుకొనివెళ్తున్నప్పుడు రిబ్కా నివసించిన ప్రదేశం ఇదే. దీనిని స్పష్టం చెయ్యడానికి “తాను ఒకప్పుడు నివసించిన ప్రదేశంలోని బంధువులు” అని జతచెయ్యవచ్చు. ఆ భూభాగం తూర్పువైపుకు అనేక వందల మైళ్ళ దూరంలో ఉంది.
# ఆమె బంధువులు
ఈ వాక్యం “వారి బంధువులు” అని కూడా అనువదించవచ్చు. అబ్రహాము సోదరుడు రిబ్కా తాత, ఆమె బంధువులు కూడా ఇస్సాకు బంధువులే.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/rebekah]]
* [[rc://*/tw/dict/bible/other/esau]]
* [[rc://*/tw/dict/bible/other/isaac]]
* [[rc://*/tw/dict/bible/other/jacob]]