te_obs-tn/content/03/02.md

1.9 KiB

దయను పొందాడు

దేవుడు నోవహు విషయంలో సంతోషించాడు, ఎందుకంటే అతడు దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయత చూపాడు. నోవహు పాపరహితుడు కాకపోయినా దేవుడు అతని పట్ల కృపచూపాడు, అతని కుటుంబాన్ని విధ్వంసకరమైన జలప్రళయంనుండి కాపాడడానికి ప్రణాళిక తయారు చేసాడు. నోవహు యోగ్యుడుగా ఇక్కడ కనిపించడం లేదు అని గుర్తించండి. లేక అతడు ఒక్కడే తప్పించుకోడానికి జరిగింది అని తలంచవద్దు. దానికి బదులు ఇది దేవుని ఎంపిక అని గుర్తించండి.

జలప్రళయం

దీనిని 03:01 లో ఏ విధంగా అనువదించారో చూడండి.

పంపించడానికి తలస్తున్నాడు

అధికమైన వర్షాన్ని పంపించడం ద్వారా భూమిని నింపి వెయ్యడానికీ లోతైన నీటిని కలుగజెయ్యడానికీ దేవుడు ప్రణాళిక చేసాడు. అంటే అధికమైన వర్షం పడేలా చెయ్యడం ద్వారా జలప్రళయం కలిగేలా ప్రణాళిక చేసాడు.

అనువాదం పదాలు