te_obs-tn/content/02/11.md

2.1 KiB
Raw Permalink Blame History

భూమి శపించబడింది

ఆదాము అవిధేయతకు శిక్షగా భూమి ఇకమీదట ఫలవంతంగా ఉండదు. తినడానికి ఆహారాన్ని పండించడానికి ఆదాము అధికంగా కష్టపడతాడు.

నీవు చనిపోతావు

వారి అవిధేయతకు అంతిమ శిక్ష మరణం. ఆత్మీయమరణం దేవుని నుండి మన ఎడబాటు. భౌతిక మరణం మన దేహం నుండి మన ఎడబాటు.

మన్నుకు చేరతావు

మట్టి లేక నేల నుండి దేవుడు ఆదామునూ, హవ్వనూ సృష్టించాడు, పాపం ఫలితంగా అతని జీవం తన వద్దనుండి తీసివేయబడుతుంది, అతని శరీరం కుళ్ళిపోతుంది, తిరిగి మన్నుగా మారిపోతుంది.

హవ్వ, అంటే ‘జీవమిచ్చునది.

ఆదాముకూ, హవ్వకూ దేవుడు జీవాన్ని ఇచ్చాడు, ప్రసవం ద్వారా ప్రతీ వ్యక్తికీ ఇది అందించబడుతూ ఉంది.

సమస్త మనుష్యులకు తల్లి

మనుష్యులందరి స్త్రీ పూర్వికురాలిగా ఆమె ఉండబోతుంది. కొన్ని భాషలలో “ఆమె మనుష్యులందరికీ అవ్వ అవుతుంది” అని ఉంది.

అనువాదం పదాలు