te_obs-tn/content/02/08.md

3.1 KiB

మీరు దిగంబరులని మీకు చెప్పినదెవరు?

లేక, “మీరు దిగంబరులని ఏవిధంగా కనుగొన్నారు?” దేవుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆయనకు తెలుసు. ఈ ప్రశ్న అడగడం ద్వారా, ఈ క్రింది ప్రశ్న అడగడం ద్వారా అవిధేయతా పాపాన్ని ఒప్పుకోడానికి దేవుడు ఆదాముకు అవకాశం ఇస్తున్నాడు. దిగంబరంగా ఉండడం పాపం కాదు. ఆవిధంగానే ఉండేలా దేవుడు వారిని సృష్టించాడు. వారి దిగంబరత్వాన్ని గురించిన జ్ఞానం పాపం. వారి సిగ్గు వారు పాపం చేసారని చూపిస్తుంది.

ఆమె నాకు పండును ఇచ్చింది

పురుషుడు తన అవిధేయతను ఒప్పుకోడానికీ, దేవునికి అవిధేయత చూపించడంలో తన బాధ్యతను అంగీకరించడానికి బదులు స్త్రీని నిందిస్తున్నాడు.

నీవేమి చేసావు?

లేక, “దీనిని నీవు ఎందుకు చేసావు?” ఈ ప్రశ్నకు సమాధానం దేవునికి ముందుగానే తెలుసు. ఈ ప్రశ్న అడగడం ద్వారా స్త్రీ తన దోషాన్ని అంగీకరించే అవకాశాన్ని దేవుడు ఆమెకు ఇస్తున్నాడు. ఆమె చేసిన దానిని చెయ్యకుండా ఉండవలసింది అనే దానిని తెలియజేస్తున్నాడు.

సర్పం నన్ను మోసగించింది

సర్పం ఆమెను మోసగించింది, తప్పుగా నడిపించింది. వాడు తనకు అబద్దం చెప్పాడు. ఆమె మీద ఒక మంత్రం వల్లె వెయ్యడం లేక ఆమెను మంత్రముగ్ధురాలను చెయ్యడం గురించిన పదాన్ని వినియోగించవద్దు. ఆమె అవిధేయతను ఒప్పుకోవడం, దేవునికి అవిధేయత చూపించడంలో ఆమె బాధ్యతను అంగీకరించడానికి బదులు సర్పాన్ని నిందిస్తుంది.

అనువాదం పదాలు