te_obs-tn/content/02/06.md

12 lines
1.5 KiB
Markdown

# వారి కన్నులు తెరువబడ్డాయి
“వారు సంగతులను భిన్నంగా చూసారు” అని తర్జుమా చెయ్యవచ్చు. వారు ఇప్పుడు మొట్టమొదటిసారి ఎదో అర్థం చేసుకొన్నారని ఈ వాక్యం తెలియజేస్తుంది. మీ భాషలో ఇటువంటి అర్థాన్నిచ్చే వ్యక్తీకరణ ఉంటే దీనిని అనువదించడానికి వినియోగించవచ్చు.
# వారు దిగంబరులమని గుర్తించారు
స్త్రీ, పురుషుడు దేవునికి అవిధేయత చూపించిన తరువాత వారు దిగంబరులుగా ఉన్నారని సిగ్గుతో నిండిపోయారు. ఆ కారణంగానే వారి దిగంబర దేహాలను కప్పుకోడానికి ఆకులను వినియోగించారు.
# వారి శరీరాలను కప్పుకొన్నారు
స్త్రీ, పురుషుడు దేవుని నుండి తమను తాము దాచుకోడానికి ఆకులను వినియోగించారు.