te_obs-tn/content/01/10.md

3.0 KiB
Raw Permalink Blame History

కొంత నేల మట్టి

దేవుడు మానవుడిని నేలనుండి తీసిన మట్టి లేక ఆరిన మట్టిలో నుండి చేసాడు. భూమి కోసం వినియోగించిన సాధారణ పదానికిది భిన్నమైనది కావచ్చును.

నిర్మించాడు

దేవుడు వ్యక్తిగతంగా మానవుడిని రూపొందించాడు అని ఈ పదం తెలియపరుస్తుంది, ఒక వ్యక్తి తన చేతులతో దేనినైనా చెయ్యడంతో సరిపోల్చుతుంది. “సృష్టించడం” అనే పదానికి భిన్నమైన పదం వినియోగించబడడం గమనించండి. మిగిలిన వాటన్నిటినీ కేవలం నోటిమాట ద్వారా సృష్టించాడు అనే దానికి ఇది పూర్తిగా భిన్నమైనదిగా ఉంది.

మానవుడు

ఈ సారి కేవలం మానవుడు సృష్టించబడ్డాడు; భిన్నమైన పద్ధతిలో స్త్రీ సృష్టించబడింది.

జీవవాయువు ఊదాడు

తనలోనుండి జీవాన్ని ఆదాము శరీరంలోనికి ఆయన బదిలీ చేసిన దేవుని వ్యక్తిగత, సన్నిహిత చర్యను తెలియచేస్తుంది.

జీవం

ఈ చర్యలో భౌతిక, ఆత్మీయ జీవం రెంటినీ దేవుడు ఊదాడు.

ఆదాము

పాత నిబంధనలో “మానవుడు” అనే పదానికి వినియోగించిన పదం ఆదాము అనే పేరుతో సమానం. తాను తీయబడిన “నేలమట్టి” కి వినియోగించిన పదం లాంటిదే.

తోట

ఒక ఉద్దేశం కోసం చెట్లు, మొక్కలూ నాటిన ఒక భూభాగం సాధారణంగా ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యడానికీ, అందాన్ని అందించే ఉద్దేశం.

దానిని భద్రంగా చూడడం కోసం.

సేద్యపరచడం, కలుపు తీయడం, నీరు పోయడం, పంట కోయడం, నాటడం మొదలైనవి చెయ్యడం ద్వారా తోటను నిర్వహించడం.

అనువాదం పదాలు