te_obs-tn/content/01/07.md

30 lines
2.3 KiB
Markdown

# ఐదవ రోజు
గతించిన నాలుగు రోజులలో దేవుడు ఆరంభించిన ఆయన వృద్ధిక్రమానుసార సృష్టిని కొనసాగిస్తున్నాడు
# దేవుడు పలికాడు
దేవుడు ఒక ఆజ్ఞను పలకడం ద్వారా పక్షులనూ, జలచరములను సృష్టించాడు.
# నీటిలో చలించువాటన్నిటిని.
దేవుడు చేపలను మాత్రమే చెయ్యలేదు, ఆ నీళ్ళనిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలనూ సృష్టించాడు. దేవుడు వాటిని సృష్టించడానికి ఎంపిక చేసాడు కనుక అన్నీ ఉనికి కలిగియున్నాయి.
# అన్ని విధాల పక్షులు
దేవుడు కేవలం ఒక విధమైన పక్షిని తయారు చెయ్యలేదు, అయితే అద్భుతమైన రూపాలు, ఆకారాలు, రంగులలో ఉండే అన్ని విధాల పక్షులను సృష్టించాడు.
# అది మంచిది
సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నెరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.
# వారిని ఆశీర్వదించాడు
వారు ఫలించాలనీ, ఆయన వారిని ఉంచిన లోకంలో అన్ని సవ్యంగా జరగాలనే తన ఉద్దేశాన్ని దేవుడు పలికాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/good]]
* [[rc://*/tw/dict/bible/kt/bless]]