Telugu tA
Go to file
ghayden 95042d6d3f Merge pull request 'formatting fixes' (#2) from STR/te_ta:master into master
Reviewed-on: #2
2021-12-22 21:59:46 +00:00
checking fix warnings 2021-12-17 11:37:19 -07:00
intro formatting corrections 2021-10-30 10:33:26 -06:00
process fix warnings 2021-12-17 11:37:19 -07:00
translate fix warnings 2021-12-17 11:37:19 -07:00
LICENSE.md Nov 2021 updates 2021-11-30 18:53:47 -07:00
README.md Nov 2021 updates 2021-11-30 18:53:47 -07:00
manifest.yaml
Valid
Dec 2021 update 2021-12-17 11:04:48 -07:00

README.md

Telugu Translation Academy

STRs

వివరణ

సభ్యోక్తి అంటే చావు, లేదా ఎవరికీ కనిపించకుండా చేసే ఇబ్బందికరమైన కటువైన సాంఘికంగా ఆమోదం అయితే మాటను ఒక మృదువైన, మర్యాదకరమైన రీతిలో చెప్పే పధ్ధతి.

నిర్వచనం

… అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. (1 దిన10:8 ULT)

అంటే సౌలు అతని కొడుకులు చనిపోయారు. అయితే ముఖ్యమైన విషయం వాళ్ళు పడి ఉన్నారని కాదు, చనిపోయారన్నదే. ఇది సభ్యోక్తి. కొన్నిసార్లు మరణం అనేది అమంగళం కాబట్టి మనుషులు సూటిగా దానిని గురించి మాట్లాడరు.

కారణం ఇది అనువాద సమస్య

వివిధ భాషలు వివిధ సభ్యోక్తులు వాడతాయి. లక్ష్య భాషలో మూల భాషలో వాడిన సభ్యోక్తి లేకపోతే చదివే వారు అర్థం చేసుకోలేక పోవచ్చు. అక్కడున్న మాటలకు అక్షర అర్థాన్నే వారు తీసుకునే అవకాశం ఉంది.

బైబిల్ నుండి ఉదాహరణలు

… సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు… (1 సమూయేలు 24:3 ULT)

మొదటి శ్రోతలకు సౌలు మూత్రవిసర్జన కోసం గుహలోకి వెళ్ళాడు అనే అర్థం అవుతుంది. అయితే రచయిత చదివే వారికి అమర్యాదగా ఉండకూడదని స్పష్టంగా సౌలు ఇందుకోసం వెళ్ళాడో చెప్పడం లేదు.

మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. (లూకా 1:34 ULT)

ఇక్కడ మర్యాద కోసం, మరియ తనకు పురుషునితో లైంగిక సంబంధం లేదు అని చెప్పడానికి సభ్యోక్తి వాడుతున్నది.

అనువాదం వ్యూహాలు

సభ్యోక్తి మీ భాషలో సహజం అయితే సరైన అర్థం ఇస్తుంటే దానిని వాడండి. అలా కాకుంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవి-

  1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
  2. సభ్యోక్తి వాడక పొతే అక్కడ ఇచ్చిన సమాచారం కటువుగా ధ్వనిస్తుంటే సభ్యోక్తి వాడండి.

అన్వయించిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

  1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
  • … గుహ ఉన్నచోట సౌలు మూత్ర విసర్జనకు (1 సమూయేలు 24:3 ULT) కొన్ని భాషలు ఇటువంటి సభ్యోక్తులను వినియోగిస్తాయి.

  • "అక్కడ ఒక గుహ ఉంది. గుంట తవ్వడానికి" సౌలు గుహలోనికి వెళ్ళాడు"

  • "అక్కడ ఒక గుహ ఉంది. ఒంటరిగా కొంత సమయం కలిగియుండడానికి సౌలు గుహలోకి వెళ్ళాడు."

  • మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది? నాకు పురుషునితో లైంగిక సంబంధం లేదు కదా?” (లూకా 1:34 ULT)

  • మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా?” (ఇది గ్రీకు మూల భాషలో సభ్యోక్తి)

  1. సభ్యోక్తితో పని లేకుండా ఆ సమాచారం అంత కటువైనది కాకపోతే సూటిగానే చెప్పండి.
  • సౌలు, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై పడి ఉన్నారు. (1 దిన 10:8 ULT)

  • "వారు సౌలును, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై చచ్చి పడి ఉండడం చూసారు.